బైడెన్ గెలిస్తే గొప్ప అధ్యక్షుడు అవుతారు : ఒబామా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అహాన్ని తృప్తి పరుచుకోవడంపైనే దృష్టి పెట్టారు తప్ప.. ప్రజలకు ఏమాత్రం మేలు చేయలేదని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా విమర్శించారు. ట్రంప్ ప్రత్యర్థిగా బరిలోకి దిగిన జో బైడెన్ మాత్రం కరోనా వైరస్ నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. మిషిగన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ మేరకు ఆయన ప్రసంగించారు. ట్రంప్ దేశాధ్యక్షత అనే బాధ్యతను రియాలిటీ షోగా ఆయన భావిస్తారు. మహమ్మారితో కుంటుపడిన మన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటే బైడెన్ అధ్యక్షుడు కావాలి అని ఒబామా వ్యాఖ్యానించారు.






