ఆ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందే… భారత్ కు అమెరికా మద్దతు
పాకిస్థాన్ భూభాగంలో కూలిన భారత క్షిపణి ఘటన ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప మరో కోణం కనిపించడం లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనిపై ఇప్పటికే మార్చి 9న భారత్ విలువైన వివరణ ఇచ్చిందని, ఇంతకంటే ఎక్కువగా దీనిపై తాము స్పందించలేమని అన్నారు. మార్చి 9న భారత వాయుసేన స్థావరంలో ఓ క్షిపణిని సాదారణ తనిఖీలు చేస్తుండగా, సాంకేతిక లోపం తలెత్తి అది గాల్లోకి లేచింది. ప్రమాదవశాత్తు దూసుకెళ్లి పాక్ భూభాగంలో పడింది. దీనిపై పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేయడంతో భారత రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు పేర్కొంది.






