నిక్కీ హేలీ ఇంట్లో తీవ్ర విషాదం… ఫాదర్స్ డే రోజునే
భారత సంతతి వ్యక్తి, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఫాదర్స్ డే రోజునే ఆమె తండ్రిని కోల్పోయారు. ప్రొఫెసర్ అజిత్ సింగ్ రాంధావా కన్నుమూసిన విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. గతంలో ఆయనకు క్యాన్సర్ నిర్ధరణ అయ్యింది. నాకు తెలిసిన తెలివైన, ప్రియమైన, అత్యంత దయ, మర్యాదగల వ్యక్తిని కోల్పోయాను అని హేలీ పేర్కొన్నారు. తన తండ్రి లేడనే విషయం తెలిసి తన హృదయం బరువెక్కిందన్నారు. తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ఆమె, తమ కుటుంబం ఎంతో కోల్పోతున్నామని పేర్కొన్నారు.






