ఆరిజోనా, నెవడాల్లో వెలువడని ఫలితాలు.. ఎందుకో తెలుసా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆరిజోనా, నెవాడాలో ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేయడమే దీనికి కారణం. ఆ బ్యాలెట్లన్నీ కౌంటింగ్ కేంద్రాలకు చేరి వాటి లెక్కింపు పూర్తికావడానికి మరో 10, 13 రోజులు పూర్తవుతుందని అంచనా. ఆరిజోనాలో 11, నెవడాలో ఆరు ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. నెవాడాలో 94 శాతం ఓట్ల కౌంటింగ్ పూర్తియింది. వీటిల్లో 51 శాతం రిపబ్లికన్లకు వచ్చాయి. కమలా హారిస్‌కు ఇక్కడ 47.2 శాతం ఓట్లు లభించాయి. ఆరిజోనాలో 70 శాతం లెక్కించగా, ట్రంప్‌నకు 52.3, కమలకు 46.8 శాతం ఓట్లు వచ్చాయి.






