Donald Trump: ఓడిపోయుంటే నా జీవితం దారుణంగా ఉండేది : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) 2024 అధ్యక్ష ఎన్నికల్లో (Election ) తన విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో పోడిపోయి ఉంటే తన జీవితం దారుణంగా ఉండేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తనతో అత్యంత దారుణంగా వ్యవహరించిందని ఆరోపించారు. మయామీ (Miami)లో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయి ఉంటే న్యాయపరమైన(Legal) సవాళ్లను ఎదుర్కొంటూ జీవితం గడిపే పరిస్థితి వచ్చుండేదని తెలిపారు.