ట్రంప్ ర్యాలీలో కాల్పుల కలకలం
అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా సాగిన ఓ ర్యాలీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లౌడెర్డేల్ ప్రాంతంలో చేపట్టిన ర్యాలీలో ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ర్యాలీ కోరల్ రిడ్జ్ మాల్ ప్రాంతంలోకి చేరుకోగా ఓ కారులో వచ్చిన దుండగుడు కదులుతున్న వాహనంలోనుంచే విచక్షణారహింతగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ర్యాలీని లక్ష్యంగా చేసుకోని దుండగుడు ఈ దాడికి పాల్పడ్డట్లు స్థానిక మీడియా వెల్లడించంది. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు పోర్కొన్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.






