అధికార మార్పిడికి సహకరిస్తా : కమలా హ్యారిస్
ఎన్నికల ఫలితాలపై డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ స్పందించారు. ప్రజా తీర్పును అంగీకరిస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు హ్యారిస్ సీనియర్ సహాయకుడు ఒకరు మీడియాకు వెల్లడించారు. ట్రంప్‌కు హ్యారిస్ స్వయంగా ఫోన్ చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికన్లందరికీ ప్రెసిడెంట్‌గా వ్యవహరించాలని సూచించారు. అధికార బదలాయింపు ప్రక్రియ సాఫీగా జరిగేందుకు సహకరిస్తానని ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌కు తెలియజేశారరని సదరు వ్యక్తి మీడియాకు వివరించారు.






