ఇది మనం కోరుకున్నది కాదు : కమలా హారిస్
ఎన్నికల్లో పరాజయాన్ని ఊహించలేదని, ఇది మనం కోరుకున్నది కాదని, మనం పోరాడిరదీ దీని కోసం కాదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డెమోక్రటిక్ అభ్యర్థి, భారతీయ అమెరికన్ కమలా హారిస్ పేర్కొన్నారు. ఓడిపోయినా అమెరికా వెలుగుల కోసం మనం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని, అది ఎల్లప్పుడూ మరింత వెలుగులు పంచాలని ఆకాంక్షించారు. ఓటమి అనంతరం హోవర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎన్నికల ఫలితాన్ని అంగీకరిస్తూ, నా మద్దతుదారులందరూ అంగీకరించి శాంతియుతంగా అధికార మార్పిడికి సహకరించాలి. ప్రజలంతా భావోద్వేగానికి గురవుతున్నారని నాకు తెలుసు. అయినా ఫలితాన్ని అంగీకరించాల్సిందే అని హారిస్ పేర్కొన్నారు. తాను ట్రంప్‌తో మాట్లాడానని, ఆయనకు శుభాకాంక్షలు తెలిపానని వెల్లడించారు.






