జో బైడెన్ మరో కీలక నిర్ణయం
రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కీవ్‌కు మరింత ఆయుధ సాయం అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో అధికార పీఠం నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఉక్రెయిన్ కోసం దాదాపు 725 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆ ప్యాకేజీలో ల్యాండ్ మైన్స్, డ్రోన్లు, స్ట్రింగర్ క్షిపణులతో పాటు హై మొబిలిటీ ఆర్టిలరీ క్లస్టర్ ఆయుధాలు సైతం ఉంటాయని వెల్లడించాయి. అధ్యక్షుడు బైడెన్ జనవరిలో పదవీవిరమణ చేయనున్నారు. దీనికి ముందే ఉక్రెయిన్ను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు అక్కడి సీనియర్ అధికారి వెల్లడిరచారు.






