అధ్యక్ష రేసు నుంచి వైదొలగడం సరైనదే
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంపై వైట్‌హౌస్ అధికారులు పలు విషయాలు తెలియజేశారు. తన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను నిలబెట్టడం సరైన నిర్ణయమేనని అప్పుడు బైడెన్ భావించినట్లు వైట్‌హౌస్ సిబ్బంది పేర్కొన్నారు. ఈ చర్యపై ఆయన గర్వించారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ పేర్కొన్నార. డెమోక్రాట్ల తరపున పోటీ చేయడానికి హారిస్ సిద్ధంగా ఉన్నారని ఆయన విశ్వసించినట్లు వెల్లడిరచారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రపంచ దేశాల నుంచి ఆయనకు ఆటంకాలు ఎదురయ్యారని అన్నారు. కొవిడ్ -19 మూలంగా వివిధ పాలనా సంబంధమైన విషయాల్లో అస్థిరత ఏర్పడిరదని, దానివల్ల రాజకీయంగా బైడెన్‌కు నష్టం కలిగిందని అన్నారు. పదవుల కంటే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమంటూ వైదొలగాలన్న తన నిర్ణయాన్ని అప్పట్లో బైడెన్ సమర్థించుకున్నారు.






