వారు దేశభక్తులు.. ఇవాంకపై విమర్శలు
అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ జో బైడెన్ గెలుపును ధ్రువీకరించే సమావేశాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. ఆందోళనలను అణచివేసే క్రమంలో జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు నలుగురు మరణించారు. ఇక ట్రంప్ తీరును సొంతపార్టీ నేతలతో పాటు ప్రపంచ దేశాధినేతలు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కుమార్తె, వైట్‌హౌజ్ సలహాదారు ఇవాంక ట్రంప్ తీరు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్రిక్తతలను తగ్గించాల్సింది పోయి అనాలోచిత వ్యాఖ్యలతో వాటిని మరింత పెంచుతూ..అగ్నికి ఆజ్యం పోస్తున్నారని మండి పడుతున్నారు. ఇంతకు విషయం ఏంటంటే క్యాపిటల్ భవనంపై దాడి చేసిన ట్రంప్ మద్దతుదారులను ఇవాంకా దేశభక్తులతో పోల్చారు. నిరసనకారులను దేశభక్తులతో పోల్చడం పట్ల తీవ్ర విమర్శలు రేగడంతో ఆ ట్వీట్‌ని డిలీట్ చేశారు.






