అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి…

అంతర్జాతీయ మత స్వేచ్ఛ సంస్థకు ఓ ముస్లిం వ్యక్తిని నామినేట్ చేయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి అని వైట్ హౌస్ తెలిపింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ సంస్థకు అమెరికా తరపున రాయబారిగా భారతీయ మూలాలున్న రషద్ హుస్సేన్‍ను ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. హుస్సేన్ ప్రస్తుతం అమెరికా జాతీయ భద్రతా మండలిలో ఓ విభాగానికి డైరెక్టర్‍గా విధులు నిర్వహిస్తున్నారు. ఒమామా హయాంలో ఆయన ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ)కు అమెరికా నుంచి ప్రత్యేక రాయబారిగా పని చేశారు.