బైడెన్-మోదీ భేటీలో కీలక నిర్ణయం
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో అమెరికాతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నారు. వచ్చే ఏడాది భారత్‌లో ఏర్పాటు చేయనున్న తొలి నేషనల్ సెక్యూరిటీ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఏర్పాటుకు అమెరికా తన సాయం అందించనున్నది. ఇక్కడ తయారయ్యే చిప్‌లను అమెరికా మిలటరీ ఫోర్సెస్ వినియోగానికి ఎగుమతి చేసేలా అమెరికా-భారత్ మధ్య ఈ ఒప్పందం కుదరింది. ఇక్కడ తయారయ్యే చిప్‌లను భారత రక్షణ దళాలకు కూడా సరఫరా చేయనున్నారు. ఇరుదేశాల రక్షణ శాఖ అధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. కోల్‌కతాలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్‌కు శక్తి అని పేరు పెట్టారు. ద్వైపాక్షిక భేటీ అనంతరం అమెరికా, భారత్ దేశాలు సంయుక్తంగా విడుదల చేసిన ప్యాక్ట్‌షీట్‌లో ఒప్పందం విషయాన్ని వెల్లడించారు.






