భారతదేశం మత విశ్వాసాలకు పుట్టినిల్లు : అమెరికా
భారతదేశం గొప్ప వైవిధ్యమైన మత విశ్వాసాలకు నిలయమని, బైడెన్ ప్రభుత్వం అందరి మత స్వాతంత్య్రాన్ని సమర్థించి ప్రోత్సహిస్తుందని అమెరికా తెలిపింది. చైనా, పాకిస్థాన్ మయన్నార్తో కలిసి 12 దేశాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆందోళనకర దేశాల జాబితాను అమెరికా ఇటీవల రూపొందించింది. వ్యక్తుల నమ్మకాల కారణంగా వేధింపులు, భయపెట్టడం, ప్రాణాలు తీయడం వంటివి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ పేర్నొన్నారు. మానవ హక్కుల విషయంలో భారత్‌ను ఈ జాబితాలో ఎందుకు చేర్చలేదు అని అడిగిన ప్రశ్నకు అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందిస్తూ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మత విశ్వాసాలకు పుట్టినిల్లు అని తెలిపారు. భారత్‌తో పాటు ప్రపంచంలోని అన్ని దేశాల్లోని మత స్వాతంత్య్రాన్ని నిశితంగా గమనిస్తున్నామని వివరించింది. ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, భారత్‌లో మత స్వాతంత్య్రం కొనసాగించేందుకు రెండు దేశాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.






