అమెరికా ప్రతినిధుల సభలో అరుదైన ఘటన!
అమెరికా ప్రతినిధుల సభలో అరుదైన ఘటన చోటు చేసుకొంది. పాలస్తీనా మూలాలున్న ఏకైక సభ్యురాలు రషీద త్లైబ్ ఇజ్రాయెల్ హమాస్ వార్‌పై మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ దశలో నదుల నుంచి సముద్రాల వరకు అనే పదం వాడారు. ఇజ్రాయెల్ నిర్మూలనను సూచించే విధంగా దీనిని వాడారంటూ చాలా మంది సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రసంగాన్ని సెన్సార్ చేసేందుకు ఓటింగ్ నిర్వహించారు. దీనిలో 234-188 మెజార్టీతో దీనికి ఆమోదం లభించింది. ముఖ్యంగా రిపబ్లికను పూర్తిగా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా 22 మంది డెమోక్రాటిక్ పార్టీ సభ్యుల మద్దతు కూడా లభించింది. రషీదా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని రిపబ్లికన్లు విమర్శించారు.






