డొనాల్డ్ ట్రంప్ కు అరుదైన గౌరవం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అరుదైన గౌరవం దక్కింది. తెంపరితనానికి మారు పేరుగా నిలిచే ట్రంప్ బంగారమని ఆయన పార్టీ నేతలు అంటున్నారు. రిపబ్లికన్ పార్టీని ముందుండి నడిపించడంలో ఆయన ఎంతో కీలకమని చెబుతున్నారు. క్యాపిటల్ హిల్ ఘటనను మినహాయిస్తే పార్టీకి ట్రంప్ ఎంతో విశ్వాసపాత్రుడని, ఆయనే తమ నాయకుడని పొగడ్తల వర్షం కురిపించారు. అంతేనా, బంగారంతో చేసిన ఆయన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండ్లో నిర్వహించిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ ఈ అరుదైన ఘట్టానికి వేదికైంది.






