అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీపై సంచలన ఆరోపనలు చేశారు. వాట్ రియల్లీ హ్యాపెన్డ్ ఇన్ వూహాన్ అనే కార్యక్రమంలో భాగంగా 30 నిమిషాల పాటు పలు విషయాలను పంచుకొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ కొవిడ్ వ్యాప్తి మొదలైన 2020 తొలినాళ్లలో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బయట బాడీ బ్యాగ్స్ కుప్పలు పడి ఉన్నట్లు ఫొటోలున్నాయని తెలిపారు. అప్పటికే పరిస్థితి ఘోరంగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలకు ట్రంప్ నిర్దిష్ట ఆధారాలు వెల్లడించలేదు. వీరంతా విన్న కథానాలే నేను కూడా విన్నాను. వుహాన్ వీధుల్లో ప్రజలు పడిపోయిన ఉన్నారని, బాడీ బ్యాగ్లు తెచ్చారని నా దృష్టికి కూడా వచ్చిందని అని ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.






