Los Angeles :లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు .. బైడెన్ కుమారుడి ఇల్లు దగ్ధం
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ను కార్చిచ్చు చుట్టుముట్టింది. వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కుమారుడి ఇల్లు సైతం కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. మాలిబులో జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ (Hunter Biden )ఇల్లు ఉంది. ఈ మంటల్లో అది కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. ఇంటిముందు ఉంచిన కారు సైతం కాలిపోయిందని తెలిసింది. ఈ విషయంపై తనకు సరైన సమాచారం లేదని జో బైడెన్ మీడియాతో పేర్కొన్నారు. మూడు గదులు కలిగిన ఈ లగ్జరీ ఇంటిని 1950లో నిర్మించినట్లు తెలుస్తోంది.






