Elon Musk :సోర్స్ కు మెడల్ హాస్యాస్పదం : మస్క్
బిలియనీర్ జార్జ్ సోరోస్(George Soros) కు అమెరికా అత్యున్నత పురస్కారాన్ని అందించడాన్ని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) తప్పుబట్టారు. వివాదాస్పద నేపథ్యమున్న వ్యక్తికి అధ్యక్షుడు బైడెన్ (Biden)మెడల్ ఆఫ్ ఫ్రీడం ప్రధానం చేయడం హాస్యాస్పదమన్నారు. నిక్కీ హేలీ(Nikki Haley) , సెనేటర్ టిమ్ షీహీ సహా పలువురు రిపబ్లికన్ నేతలు ఈ నిర్ణయం పై మండిపడ్డారు. ప్రధాని మోదీ(Modi ) ని జార్జ్ సోరోస్ ఇటీవల బహిరంగంగా విమర్శించడం తెలిసిందే.
ఆయనతో పాటు 19 మందికి అమెరికా అత్యున్నత పురస్కారమైన మెడల్ ఆఫ్ ఫ్రీడంను బైడెన్ ప్రదానం చేశారు. మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ, ఫుట్బాల్ స్టార్ లయొనెల్ మెస్సీ, నటుడు డెంజల్ వాషింగ్టన్ తదితరులు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. అవార్డు తీసుకునేందుకు వేదికనెక్కిన హిల్లరీకి స్టాండిరగ్ ఒవేషన్ లభించింది. సోరోస్ తరపున ఆయన కుమారుడు అవార్డును స్వీకరించారు. ఈ గౌరవం తనకెంతగానో కదిలించిందని సోరోస్ ఒక ప్రకటనలో తెలిపారు. వలసదారునైన తనకు అమెరికాలో స్వేచ్చ లభిచిందన్నారు.






