అమెరికా విదేశాంగ మంత్రిగా రూబియో!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కీలక పదవుల భర్తీపై భారీ కసరత్తు చేస్తున్నారు. విదేశాంగ శాఖ మంత్రిగా ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోను నియమించనున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఈ పదవికి ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి పేరు ప్రముఖంగా వినిపించింది. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)గా కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అమెరికా ఆర్మీలోని ప్రత్యేక భద్రతా దళం ( గ్రీన్ బెరె)లో భాగంగా ఆఫ్గానిస్థాన్‌లో సేవలందించిన వాల్జ్ 2019 నుంచి ప్రతినిధుల సభలో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఇండియా కాకస్‌కు సహ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మైక్ వాల్జ్‌కు భారతీయులతో సన్నిహిత సంబంధాలున్నాయి. అమెరికా రక్షణ మంత్రి నియామకంపై ట్రంప్ ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.






