చైనాకు మరో షాక్ …కీలక బిల్లుపై ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్ష పదవికి దూరం కానున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై దాడికి తన చివరి అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. చైనా కంపెనీలను అమెరికా ఎక్స్చేంజీల నుండి తొలగించే అవకాశం కల్పించే బిల్లులపై ట్రంప్ సంతకం చేశారు. తమ దేశంలో అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అవలంబిస్తోందంటూ చైనాపై చాలాకాలంగా విరుచుకు పడుతున్న ట్రంప్ బిలియన్ డాలపై దిగుమతులపై తారిఫ్‌లను విధించిన సంగతి తెలిసిందే. తాజాగా చైనాకు మరోసారి షాకిచ్చేలా కీలక అదేశాలను జారీ చేశారు. దీంతో ప్రపంచంలోని రెండు దిగ్గజ ఆర్థిక వ్వవస్థలైన అమెరికా-చైనా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రికత్తను మరింత రగలించనుంది. మరో ట్రేడ్ వార్‌కు తేరలేవనుంది.






