Donald Trump: మస్క్ ప్రతిపాదన నచ్చింది : ట్రంప్

ఫెడరల్ వ్యవస్థ తగ్గింపుతో పొదుపు చేసిన డబ్బు ఖర్చుపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఏఫీషియెన్సీ ( (డోజ్) ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సమర్థించారు. వ్యయ తగ్గింపుతో మిగిల్చిన మొత్తంలోని కొంత డబ్బును అమెరికా పౌరులకు డివిడెండ్ రూపంలో తిరిగి ఇచ్చే ఆలోచన తనకు నచ్చిందన్నారు. మయామీ (Miami)లో జరిగిన ఇన్వెస్టర్స్ మీట్ (Investors Meet )లో ఆయన మాట్లాడారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ మస్క్ ప్రతిపాదనకు మద్దతిచ్చారు. వ్యయ తగ్గింపులతో మిగిలే మొత్తం లో 20 శాతాన్ని అమెరికా పౌరులకు డివిడెండ్‌గా ఇవ్వాలని, మరో 20 శాతాన్ని జాతీయ రుణాలను చెల్లించడానికి ఉపయోగించాలని డోజ్(Doze) ప్రతిపాదించింది. ఈ సొమ్ము ప్రజల ఖాతాలోకి వెళ్లడం ద్వారా వృధాను అరికట్టేందుకే వారే ముందుకొస్తారన్నారు.