Ukraine :ఉక్రెయిన్ కు బిగ్ షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తీవ్ర వివాదస్పద నిర్ణయాలతో తరచు వార్తలల్లో నిలుస్తున్నారు. తాజాగా గత మూడేళ్లుగా రష్యాతో అలుపెరగని పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ (Ukraine)కు బిగ్ షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు అమెరికా సహాయం అందించాలంటే తమ డిమాండ్స్ తీర్చాల్సిందే అంటూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కి (Zelensky) ముందు ప్రతిపాధనలు పెట్టారు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాలపై అమెరికా (America)కు 50 శాతం యాజమాన్యపు హక్కులు కల్పించాలనే విషయాన్ని వాషింగ్టన్ సూచించింది. రష్యా (Russia)తో శాంతి ఒప్పందం కుదిరితే, ఆ ఖనిజాలను రక్షించేందుకు ఉక్రెయిన్‌లో అమెరికా సైన్యాన్ని మోహరించేందుకు కూడా సిద్ధంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు అందించిన బిలియన్ల డాలర్ల సాయం, ఆయుధ సరఫరాకు ప్రతిఫలంగా ఉక్రెయిన్ తిరిగి చెల్లించాల్సిన రీతిగా అమెరికా ఈ అరుదైన ఖనిజాల్లో యాజమాన్య హక్కులను కోరుతున్నట్లు అధికారులు తెలిపారు.