కమలకు బైడెన్ వెన్నపోటు పొడిచారా? … డెమోక్రటిక్ పార్టీలో
జో బైడెన్ ఎన్నికల రేసులో కొనసాగి ఉంటే డొనాల్డ్ ట్రంప్ తేలిగ్గా 400 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకునేవారని శ్వేతసౌధం అంతర్గత సర్వేల్లో తేలింది. ఈ విషయాన్ని మాజీ అధ్యక్షుడు ఒబామాకు గతంలో స్పీచ్ రైటర్‌గా పని చేసిన జాన్ ఫ్రావూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన సేవ్ అమెరికా అనే పాడ్‌కాస్ట్‌ను నిర్వహిస్తున్నారు. బైడెన్ అమెరికా ఎన్నికల రేసులో నిలిచి అతి పెద్ద తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. బైడెన్ రేసు నుంచి వైదొలగి, ఎన్నికల పగ్గాలు కమల చేతికి అందించినప్పుడు మాకో విషయం తెలిసింది. అధ్యక్షుడి అంతర్గత సర్వే నివేదికల ప్రకారం ట్రంప్ 400 ఎలక్టోరల్ ఓట్లు గెలచుకోనున్నట్లు తేలింది. అసలు బైడెన్ రేసులో ఉండటం అత్యంత ఘోరమైన నిర్ణయం. ఆయన డెమోక్రాట్లకు పూర్తిగా నష్టం జరిగే వరకూ ఈ విషయాన్ని అంగీకరించలేదు. పైగా తన పాలన చరిత్రాత్మకం అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత బలంగా ఉందని చెప్పారు. అంతేకాదు అధ్యక్షుడి బృందం కమల హారిస్‌కు వెన్నుపోటు పొడిచింది. ఆమె గెలవలేరని మీడియాకు లీకులిచ్చింది అని జాన్ ఫ్రావూ పేర్కొన్నారు.






