అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ కు ఏమైంది?
అగ్రరాజ్యం అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ గత వారం నుంచి ఆసుపత్రిలో ఉన్నారు. అనారోగ్య సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు పెంటాన్ మీడియా కార్యదర్శి ఎయిర్ఫోర్స్ మేజర్ జనరల్ ప్యాట్ రైడర్ వెల్లడిరచారు. ఆయన ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారో స్పష్టత లేదన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు తెలిపారు. అయితే, ఆస్టిన్ ఆసుపత్రిలో చేరి ఐదు రోజులు అవుతున్నా పెంటగాన్ ఈ విషయాన్ని బయట పెట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా అమెరికాలో అధ్యక్షుడు సహా కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరితే ఆ విషయాన్ని వెంటనే ప్రకటిస్తారు. కానీ, ఆస్టిన్ విషయంలో అలా జరగకపోవడంపై పెంటగాన్ ప్రెస్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.






