Donald Trump :కెనడా, మెక్సికోలపై … నేటి నుంచే : ట్రంప్

పొరుగుదేశాలనైన కెనడా(, Canada), మెక్సికో (Mexico)లపై ప్రకటించిన 25 శాతం టారిఫ్ పెంపు నేటి నుంచే అమలవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )ప్రకటించారు. వైట్‌హౌస్‌లో ఓవల్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. టారిఫ్‌లు విధించే కెనడా, మెక్సికో వస్తువుల జాబితాలో చమురును చేర్చాలా వద్దా అనేది కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ రెండు దేశాల నుంచి దిగుమతయ్యే ఆయిల్ ధర సరిగ్గా ఉందని భావిస్తే టారిఫ్ ఉండదని చెప్పారు.
కెనడా, మెక్సికోలపై టారిఫ్ విధింపునకు ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాల నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్(Drug), స్మగ్లింగ్ (Smuggling) ఎక్కువన్నారు. ఈ రెండు దేశాలతో అమెరికా వాణిజ్యం భారీ లోటు ఉందని చెప్పారు. వాణిజ్యం విషయంలో ఈ రెండూ అమెరికాలో చాలా అన్యాయంగా వ్యవహరించాయన్నారు. ఇవి ఎగుమతి చేసే వస్తువులు ఆయిల్, కలప వంటి వాటి అవసరం తమకు లేదన్నారు. ప్రస్తుతం ఏడాదికి కెనడాకు 175 బిలియన్ డాలర్లు, మెక్సికోకు 300 బిలియన్ డాలర్ల వరకు అమెరికా సబ్సిడీల రూపంలో అందిస్తోందని ట్రంప్ వివరించారు.