Citizenship : పౌరసత్వ రద్దు యోచన దారుణం : బైడెన్
అమెరికాలో జన్మ హక్కు పౌరసత్వన్ని (Citizenship) రద్దు చేయాలన్న కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆలోచనలను అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తీవ్రంగా తప్పుబట్టారు. తల్లిదండ్రుల ఇమిగ్రేషన్ హోదా (Immigration status) తో నిమిత్తం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ అమెరికా పౌరసత్వం కల్పిస్తోంది. ఈ జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. తాను అధికారం చేపట్టిన తొలి రొజే ఈ మేరకు కార్యనిర్వాహక చర్యలు తీసుకునే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన జన్మహక్కును మార్చాలనే ఆలోచనే దారుణమని బైడెన్ అన్నారు. అమెరికా జన్మించినవాళ్లు దేశ పౌరులు కాకుండా ఎలా పోతారని ప్రశ్నించారు. సరిహద్దు నిబంధనల అములను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ద్వైపాక్షిక ఇమిగ్రేషన్ బిల్లుకు మద్దతుగా ఓటేయొద్దని చట్టసభ సభ్యులను ట్రంప్ కోరడం హాస్యాస్పదమన్నారు. ట్రంప్‌కు అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతోందని బైడెన్ అన్నారు.






