జో బైడెన్ కీలక ప్రతిపాదనలు.. హెచ్ 1బీ వీసాదారులకు ఊరట
అమెరికాలో హెచ్ 1బీ, ఇతర వీసాదారుల కనీస వేతన పరిమితిని భారీగా పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అమలును మరో 18 నెలలు వాయిదా వేయాలని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో కనీస వేతన పెంపు నిబంధన అమలులో తలెత్తే న్యాయ, విధానపరమైన సమస్యలను పరిశీలించేందుకు కార్మిక శాఖకు మరింత సమయం లభిస్తుంది. హెచ్ 1బీ వీసాదారుల వార్షిక వేతన పరిమితి 65 వేల డాలర్లుగా ఉండేది. దీనిని లక్షా పది వేల డాలర్లకు ట్రంప్ సర్కారు పెంచింది. దీని అమలు తేదీని మార్చి 15గా నిర్ణయించింది. అయితే దీనిని 60 రోజులు వాయిదా వేస్తూ ఈ నెల ప్రారంభంలో జో బైడెన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా 2022 నవంబర్ 14 వరకు గడువు పెంచింది. దీంతో హెచ్ 1బీ వీసాదారులకు ఊరట లభించినైట్లైంది.






