ట్రంపే గెలుస్తారు.. సంచనాల జ్యోతిష్యురాలి అంచనా
డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌ల మధ్య ఓటర్ల మద్ధతు కేవలం ఒక్క శాతం తేడా ఉందన్న వార్తల నడుమ అక్కడి ప్రముఖ జ్యోతిష్యురాలు అమీ ట్రిప్ అసక్తికరమైన భవిష్యవాణి వినిపించారు. అమెరికా అధ్యక్ష పగ్గాలు ట్రంప్ చేతి కొస్తాయని చెప్పారు. అధ్యక్షుడు జో బైడెన్ జూలై 21న రేసు నుంచి తప్పుకుంటారని ఆమె చెప్పిన జోస్యం ఫలించింది. దాంతో ఆమె పేరు మారుమోగిపోయింది. సూర్యుడు ట్రంప్‌నకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఈసారి గెలుపు ట్రంప్‌దే అంటూ ట్రిప్ చేసిన తాజా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతేకాదు, హారిస్ శక్తిమంతమైన నాయకురాలిగా ఎదుగుతారు. నాలుగేళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతారు అంటూ 2020లోనే చెప్పారు. అదీ అక్షరసత్యమైనట్టే కన్పిస్తోంది.






