Trump: ఆ నిర్ణయంతో అమెరికన్లు సంతోషంగా లేరు : ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (Jimmy Carter) ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 30 రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయాలని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తప్పుబట్టారు. అంతేకాక దీనిపై అమెరికన్లు సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో జాతీయజెండా అవనతం చేసి ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయంగా వారు భావిస్తున్నారు. ఎందుకంటే వాస్తవంగా వారికి దేశం అంటే ప్రేమ లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మరణం కారణంగా, కాబోయే అధ్యక్షుడి ప్రారంభానికి జెండా అవనతమై ఉండటం బహుశా ఇది మొదటిసారి కావచ్చు. ఎవరూ దీన్ని చూడాలని అనుకోరు. ఈ నిర్ణయంపై ఏ అమెరికన్ సంతోషంగా లేరు అని ట్రంప్ పేర్కొన్నారు.






