BCCI: బుమ్రాకు రూ. 2 కోట్ల షాక్? బీసీసీఐ కీలక నిర్ణయం..!
బీసీసీఐ (BCCI) తాజాగా తీసుకున్న ఒక కీలక నిర్ణయం కారణంగా టీం ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) భారీగా ఆదాయాన్ని కోల్పోనున్నాడు. సుమారు రూ. 2 కోట్ల కోత పడనుండటంతో, ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ ప్రత్యేక పరిహారం చెల్లించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్ల పనిభారాన్ని తగ్గించేందుకు అమలు చేస్తున్న కొత్త పాలసీ ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా జేబుకు చిల్లు పెడుతోంది. వరుస టోర్నీలు, ముఖ్యంగా ఐపీఎల్(IPL 2026), అంతర్జాతీయ టీ20ల నేపథ్యంలో బుమ్రా లాంటి కీలక బౌలర్లకు విశ్రాంతినివ్వాలని బోర్డు నిర్ణయించింది.
సాధారణంగా భారత ఆటగాళ్లకు వారి సెంట్రల్ కాంట్రాక్ట్ ఫీజుతో పాటు, ఆడే ప్రతి మ్యాచ్కు మ్యాచ్ ఫీజు అందుతుంది. తాజా నిర్ణయం ప్రకారం, రాబోయే కొన్ని సిరీస్ల నుంచి బుమ్రాకు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. దీనివల్ల ఆయన దాదాపు 10 నుండి 12 అంతర్జాతీయ మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఈ మ్యాచ్లు ఆడకపోవడం వల్ల బుమ్రా సుమారు రూ. 2 కోట్ల వరకు మ్యాచ్ ఫీజును కోల్పోయే అవకాశం ఉంది. బుమ్రా స్వయంగా తప్పుకోలేదు కాబట్టి, బోర్డు నిర్ణయం వల్ల ఆటగాడు ఆర్థికంగా నష్టపోకూడదని బీసీసీఐ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి
బుమ్రా కోల్పోయే మ్యాచ్ ఫీజును ఒక ప్రత్యేక బోనస్ లేదా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అలవెన్స్ రూపంలో చెల్లించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. కేవలం బుమ్రా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) వంటి సీనియర్లకు విశ్రాంతి ఇచ్చినప్పుడు కూడా ఇదే తరహా పరిహారం అందించే పాలసీని తీసుకురావాలని బోర్డు యోచిస్తోంది. ముఖ్యంగా ప్రపంచకప్ (World Cup) వంటి పెద్ద టోర్నీల ముందు బుమ్రా ఫిట్నెస్గా ఉండటం భారత్కు అత్యవసరం. గతంలో వెన్నునొప్పి కారణంగా బూమ్రా సుదీర్ఘకాలం ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.
అందుకే, డబ్బుల గురించి ఆలోచన లేకుండా ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలని బోర్డు బుమ్రాకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఐపీఎల్ జట్లు కూడా తమ స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, బీసీసీఐ మాత్రం నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. బుమ్రాకు ఇచ్చే ఈ పరిహారం ఇతర ఆటగాళ్లకు కూడా ఒక ధైర్యాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








