సమాజం అభివృద్ధి కోసం పాటుపడాలి : ఉపరాష్ట్రపతి
ప్రతి వ్యక్తి తన కోసం కాకుండా సమాజం అభివృద్ది కోసం పాటు పాడాలని, అప్పుడే సమాజంలో ఉన్న దారిధ్య్రం నిరక్ష్యరాస్యతలను రూపుమాపే అవకాశం ఏర్పడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను జ్యోతిప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ నాకు మొదటి నుంచి గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదవారికి సేవచేయటం ఇష్టమని అందుకు వారి కోసం ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనటం ఆనందంగా ఉంటుందన్నారు. దేశంలో ఇప్పటికే పేదలకు వైద్యం అందుబాటులో లేదని, అలాంటి వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఇటువంటి వైద్య శిభిరాలు ప్రజలకు ఉపయోగపడతాయన్నారు. పేదలకు సేవచేయడమే ఓ అనుభూతిని అందుకోసమే స్వర్ణభారతి ట్రస్టును ప్రారంభించామన్నారు. ఈ సేవా కార్యకమ్రాలను ముందుకు తీసుకువెళ్లడానికి ట్రస్టు సభ్యులు కృషి చేయాలన్నారు. ప్రతి వ్యక్తి సమాజ హిత కోసం ఆలోచించాలని, సమాజం కోసమే జీవించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.













