బిజెపికి పెద్ద సవాలే
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాబల్యానికి, అధికార బిజెపికి పట్టుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ రెండు స్థానాల్లో గోరఖ్‌పూర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తుంటే ఫూల్పూర్ స్థానానికి ఉప ముఖ్యమంత్రి కేశవప్రసాద్ ప్రాతినిధ్యం వహించారు. అయితే వీరిద్దరూ రాష్ట్ర శాసన పరిషత్‌కు ఎన్నిక కావడంతో రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాల్సి వస్తోంది. ఈ రెండూ తూర్పు యూపీ పరిధిలోని స్థానాలు కాబట్టి వీటి ఫలితాలు అధికార, విపక్షాలకు భవిష్యత్ సంకేతాలే అవుతాయి.













