కేసీఆర్ ఇప్పటికైనా స్థానం ఇస్తారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి విమర్శలు చేశారు. కేసీఆర్ తన మంత్రి వర్గంలో ఐదేళ్లపాటు మహిళలు లేకుండా చేశారని, మరో ఐదేళ్లు ఇదే ప్లాన్‌తో ఉన్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు మాత్రం ఈ విషయంపై పెద్దగా పట్టింపులు లేకపోవడం, మహిళలపై ఆయనకున్న ఉదాసీనతకు నిదర్శనమని అన్నారు. గత ఐదేళ్లు కాలంలో మహిళా మంత్రులకు స్థానమివ్వకుండా కేబినెట్లో కొనసాగించిన పరిస్థితి మళ్లీ పునరావృతం అవుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గంలో మహిళలకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖను కేటాయించడం మీద జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందంటూ కనీసం దీనిని చూసిన తర్వాత అయినా కేసీఆర్ గారు మహిళలకు తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా? అని ప్రశ్నించారు.













