పెద్దపల్లి వైద్యుడికి ఉపరాష్ట్రపతి అభినందన
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో 45 ఏండ్ల వ్యక్తి ఆదివారం కరోనాతో మృతి చెందగా, మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మానవత్వంతో స్పందించిన పెద్దపల్లి జిల్లా సర్వైవ్లెన్స్ అధికారి డాక్టర్ శ్రీరాంను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా అభినందించారు. మృతదేహాన్ని ట్రాక్టర్లో తరలిస్తున్న పెండాల్య శ్రీరాం ఫొటోను ట్యాగ్ చేసిన ఉప రాష్ట్రపతి, వైద్యుడి చొరవ అంకిత భావం సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. డాక్టరే డ్రైవర్గా మారి భౌతికకాయం తరలించిన తీరును అభినందించారు.













