స్విట్జర్లాండ్ వర్సిటీతో వీహబ్ ఒప్పందం
ఆరోగ్య, ఔషధ, జీవశాస్త్రా రంగాల్లో అంకుర పరిశ్రమ అభివృద్ధి కోసం స్విట్జర్లాండ్‌లోని బాసెల్ విశ్వవిద్యాయతో తెలంగాణ ప్రభుత్వ మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం (వి-హబ్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హెచ్ఐసీసీలో మంత్రి కేటీఆర్, భారత్‌లోని స్విట్జర్లాండ్ రాయబారి అండ్రూస్బామ్ సమక్షంలో వి-హబ్ సీఈవో రావు దీప్తి, బాసెల్ విశ్వవిద్యాయ ఆవిష్కరణలు, పారిశ్రామిక విభాగాధిపతి క్రిస్టియన్ ఎలియాస్ స్నెడర్ లు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారత రాష్ట్రాల్లోని స్విట్జర్లాండ్ కాన్సుల్ జనరల్ సెబాస్టియన్ హగ్, పరిశ్రమ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ లు పాల్గొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల పారిశ్రామిక శిక్షణ, అంకుర పరిశ్రమ బదలాయింపు, విలీనం పర్యావరణ వ్యవస్థ అధ్యయనం, వ్యాపార నైపుణ్య, సాంకేతిక సహకారాని కోసం ఈ ఒప్పందం జరిగింది.













