టీఎస్ఐడీసీ చైర్మన్ గా వేణుగోపాలాచారి
భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్) సీనియర్ నాయుడు, సముద్రాల వేణుగోపాలచారికి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఐడీసీ) చైర్మన్గా ఆయనను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేణుగోపాలాచారి రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం అనేక సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదులు చేయడం, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రాజెక్టులను అభ్యంతరాలు తెలపడం, కృష్ణా నదీ జలాల్లో వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు తెలపడం, కృష్ణా నదీ జలాల్లో వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టడం, సీడీబ్ల్యూసీ అనేక ఉత్తర్వులను జారీ చేస్తున్న తరుణంలో అత్యంత కీలకమైన ఈ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం వేణుగోపాలచారికి అప్పగించడం గమనార్హం.













