ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో తిరగబడే పరిస్థితి : ఉత్తమ్
సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోందని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని ఈ సందర్భంగా ఉత్తమ్ గుర్తు చేశారు. వరి పంట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఆంక్షలు విధించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. రైతులపై ఆంక్షలు పెట్టే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిదని నిలదీశారు. సిద్దిపేట కలెక్టర్ తీరును రైతు లోకమంతా గర్హిస్తోందన్నారు. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంపై రైతులు తిరగబడే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. వరి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.













