మేం అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తాం
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దుచేస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తామని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తదితరులతో కలిసి ఉత్తమ్ మాట్లాడారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఉపాధ్యాయులంతా హర్షవర్దన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించాలన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.













