కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన… కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
దివంగత సినీ నటుడు, బీజేపీ నాయకుడు కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌లతో కలిసి ఆయన హైదరాబాద్‌లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. అనంతరం కృష్ణంరాజు సతీమని శ్యామలాదేవి, వారి కుమార్తెలతో పాటు, ప్రభాస్‌ను పరామర్శించారు. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యానికి కారణం ఏంటి? ఏయే చికిత్సలు అందించారో ఎంపీ లక్ష్మణ్ రాజ్‌నాథ్‌కు వివరించారు. కృష్ణంరాజు సతీమణి, కుమార్తెలకు దైర్యం చెప్పారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు కృష్ణంరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.













