ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి : కిషన్ రెడ్డి
ప్రతి ఒక్కరూ తమ రోగనిరోధక శక్తిని పెంపొదించుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ల్యాబ్ క్యూబ్ సంస్థ తయారు చేసిన ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్ ను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వేళ ఆయుర్వేదం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చాలావరకు ఇమ్యూనిటీ బూస్టర్లు ఆయుర్వేద వనమూలికలతో తయారు కావడం ఆనందంగా ఉందన్నారు. అయినప్పటికీ కరోనా బారిన పడకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలను పాటించాలని ప్రజలకు సూచించారు. ల్యాబ్ క్యూబ్ తయారు చేసే ఆయుర్వేద, నియో మెడికల్ ఉత్పత్తులు ప్రభావవంతంగా పనిచేస్తాయని అభిప్రాయపడ్డారు. అనంతరం సంస్థ సీఈవో శ్రీనివాస్ మనప్రగడ మాట్లాడుతూ మేకిన్ ఇండియా, ఆయుష్, సాధికారత, మహిళలకు ఉపాధి కల్పన వంటి భారత ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా తాము పనిచేస్తామన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తమకు ఎంతో స్ఫూర్తిని అందిస్తారని పేర్కొన్నారు. తద్వారా సామాన్యులకు అందుబాటు ధరలో తమ ఉత్పత్తులను అందించగలుగుతున్నామని వెల్లడించారు. తమ ఉత్పత్తుల్లో ఆరోగ్య ఆయుష్ ఇమ్యూన్ బూస్టర్ షాట్, ల్యాబ్ క్యూబ్ కోవిడ్ సేఫ్టీ కిట్, ల్యాబ్ క్యూబ్ ట్రావెల్ సేఫ్టీకిట్, ల్యాబ్ క్యూబ్ స్కూల్ సేఫ్టీ కిట్, ల్యాబ్‌క్యూబ్ కవచ్ కిట్, ల్యాబ్ క్యూబ్ ఇమ్యూనిటీ సూప్‌లు, నూడిల్స్, ఫొటాటో చిప్ప్ వంటివి ఉన్నాయని తెలిపారు.













