భద్రాద్రి రామునికి టీటీడీ పట్టువస్త్రాలు
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీసీతారాములకు జరగబోయే కల్యాణ మహోత్సవానికి శ్రీవారి తరపున తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా పట్టువస్త్రాలు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీవారి ఆలయ సాంప్రదాయం ప్రకారం గత 17 సంవత్సరాలుగా శ్రీసీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలను అందజేస్తామని, అదే సాంప్రయదాన్ని ఈ సంవత్సరం కూడా పాటిస్తున్నామని జేఈవో తెలిపారు.













