తెలంగాణ రైతులకు శుభవార్త
తెలంగాణ రైతులకు శుభవార్త. రైతుబంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.6900 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు విడుదలకు సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైతుబంధు పంటల పెట్టుబడి సాయాన్ని రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచతూ గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఒక పంటకు రూ.5 వేలు అందించనున్నారు. త్వరలో వర్షాకాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సాయాన్ని రైతులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ఈ రోజు నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కొనసాగుతోంది. ఈ మొత్తాన్ని విడుదల చేసే తేదీలను రాష్ట్రం ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది.













