తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..ఉద్యోగుల విభజనకు
తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల విభజన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి, కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల కేటాయింపు కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో, జోనల్ పోస్టులకు, మల్టీ జోనల్ పోస్టులకు జీఏడీ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు.













