హుజూర్నగర్లో టీఆర్ఎస్ ఘన విజయం
హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితంలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 43,284 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిరెడ్డిపై శానంపూడి సైదిరెడ్డి గెలుపొందారు. మొత్తం 22 రౌండ్లలోనూ సైదిరెడ్డినే ఆధిక్యం ప్రదర్శించారు. ఏ రౌండ్లోనూ కూడా పద్మావతి లీడ్లో లేకుండా పోయింది. తొలి రౌండ్ నుంచి సైదిరెడ్డి ఆధిక్యం ప్రదర్శిస్తూ భారీ మెజార్టీతో విజయాన్ని కైవసం చేసకున్నారు. హుజూర్నగర్ గడ్డపై గులాబీ జెండాను రెపరెపలాడించారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెండో స్థానానికి పరిమితం కాగా, మూడో స్థానంలో స్వతంత్య్ర అభ్యర్థి సపావత్ సుమన్ నిలిచారు. బీజేపీ నాలుగో స్థానానికి, టీడీపీ ఐదో స్థానానికి పడిపోయింది.













