టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్
ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాఘవను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వచ్చినట్టు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వనమా రాఘవేంద్రరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వనమా అరాచకాలను చెబుతూ రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని ఈ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు రామకృష్ణ.













