జాతీయ రహదారులపై టీఆర్ఎస్ రాస్తారోకో..
తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొని తీరాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్ గారి పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులపై రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టిన రైతులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు.
నాగ్ పూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై మంత్రులు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, డీసీసీబీ, డీసీఎంఎస్ ల చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, రైతుబంధు సమితి ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాలకు దిగారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేసినట్లుగానే తెలంగాణ ధాన్యాన్నికొనాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతుందని ఆరోపించారు. కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనేలా చేస్తామన్నారు. బాజాప్తా వరి వేయండని, మీ వడ్లను మేం కొనిపిస్తామన్న రాష్ట్ర బీజేపీ నాయకులు తీరా పంట చేతికి వచ్చాకా మోహం చాటేస్తున్నారని విమర్శించారు.













