తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు
ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ఈ విషయంలో ఐదంచెల యాక్షన్ ప్లాన్ను టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రటించిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనల్లో మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలోని మంచుకొండ ప్రధాన రహదారిపై మంత్రి పువ్వాడ అజయ్, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ధాన్యం కొనుగోలుపై కేంద్రం దిగివచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని, అంతవరకు కొట్లాడుతామని టీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేశాయి.













