టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. జెండా పండుగ
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు జెండాపండుగలో పాల్గొనాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ జనరల్ సెక్రెటరీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతు బంధు కమిటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా కలిసి గ్రామంలోని పార్టీ శ్రేణులతో అందరినీ కలుపుకొని ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఉదయం 9 గంటలకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలనీ, దీంతో పాటు పట్టణాల్లోని బస్తీలు వార్డ్ కమిటీల ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేయాలని సూచించారు.













