తెలంగాణలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీ భానుప్రసాద్, ఎంసీ కోటిరెడ్డి, దండే విఠల్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరి చేత మండలిలోని తన చాంబర్లో చైర్మన్ ప్రొటెం సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ ప్రమాణం చేయించారు. అనంతరం ప్రొటెం చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహ చార్యులుతో కలిసి శాసన మండలి రూల్స్ బుక్స్, ఐడి కార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు ఎమ్మెల్సీలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.













